ఆ బంధానికి అడ్డొస్తోందని కుమార్తెను హత్య చేసి - పాముకాటుతో చనిపోయిందని నమ్మించే యత్నం, చివరకు? - Woman Killed her Child
Published : Feb 17, 2024, 10:16 AM IST
Mother killed her Daughter in Nagar Kurnool : వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని ఓ తల్లి తన సొంత బిడ్డను కడతేర్చింది. ఈ దారుణ ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్త కుంటపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం మల్లీశ్వరి అనే మహిళ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో తరుచూ ఫోన్ మాట్లాడుతోంది. ఈ విషయాన్ని నాగర్ కర్నూల్లో పెయింటింగ్ పని చేసుకునే తన తండ్రి తిరుపతయ్యకు రెండో కుమార్తె జాను చెబుతుందనే కారణంగా అడ్డు తొలిగించుకోవాలని భావించింది.
Woman Killed her Child at Nagar Kurnool : ఈ క్రమంలో తన కుమార్తె గొంతు నులిమి చంపింది. పాము కాటుతో తన బిడ్డ చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో చిన్నారి శరీరంపై గాయాలను గమనించిన బంధువులు, తల్లి మల్లీశ్వరిని నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.