లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా ఉనికి కోల్పోతుంది : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి - MLC Jeevan Reddy on TS Investments
Published : Jan 21, 2024, 3:31 PM IST
MLC Jeevan Reddy Interesting comments on BRS : లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా ఉనికి కోల్పోతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ప్రాజెక్టులు నిర్మిస్తే మూడేళ్లు కూడా నిలబడలేదని దుయ్యబట్టారు. టీఎస్పీఎస్సీ సంస్థను బీఆర్ఎస్ అమ్మకంలో పెట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే కనుమరుగు అయిందని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా ఉనికి కోల్పోతుందని జోస్యం చెప్పారు.
MLC Jeevan Reddy on Telangana Investments : దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ ప్రపంచ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని జీవన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం ఒక్క పర్యటనతో రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో పలు దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.93 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు.