ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎమ్మెల్యే దాతృత్వం- మొదటి జీతం ఏం చేశారంటే! - MLA Raju First Salary To Madakasira - MLA RAJU FIRST SALARY TO MADAKASIRA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 5:53 PM IST

MLA Raju First Salary Donated To Madakasira Municipality : శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే M.S. రాజు దాతృత్వాన్ని చాటుకున్నారు. తన మొదటి నెల జీతం లక్ష 75వేల రూపాయలు మడకశిర నగర పంచాయతీకి విరాళంగా ఇచ్చారు. చెక్కును తన సతీమణి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామితో కలిసి అధికారులకు అందజేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మొదటి జీతాన్ని విరాళంగా అందించడంతో ఎమ్మెల్యేను మున్సిపల్ అధికారులు అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడుతున్నారు.

అందులో భాగంగా మడకశిర మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలనే కృత నిశ్చయంతో మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబాలకు ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చినట్లు ఎమ్మెల్యే M.S. రాజు తెలిపారు. త్వరలోనే మంత్రి అచ్చంనాయుడు చేతుల మీదుగా వక్క మార్కెట్ భూమి పూజ జరగనుందని తెలిపారు. వీటితోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details