అధికారి స్వామి భక్తి - మహిళలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు - వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 1:37 PM IST
MLA Kethireddy Fire on Officer in Satyasai District : బత్తలపల్లి మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్సీపీ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వద్ద ఓ అధికారి స్వామి భక్తి చాటేందుకు ప్రయత్నించారు. బుధవారం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వైఎస్సార్ (YSR) ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (MLA Kethireddy Venkataramo reddy) హాజరయ్యారు. ఆయనకు అభిమానులు దండలు వేయడంతో తలపై పూలుపడ్డాయి.
ఓ అధికారి స్టేజిపై ఉన్న ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తలపై ఉన్న పూలు (Flowers) తొలగించడానికి ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే నా తలపై ఎవరూ చేయి పెట్టొద్దు అన్నారు. దీంతో ఆ అధికారి వెనుదిరిగి వచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ వినపడుతోందా అంటూ మహిళలను ప్రశ్నించారు. మహిళలను బులుగు చీర, జాజి, కనకాంబర పూలు పెట్టుకున్న ఆయమ్మా వినపడుతోందా? అని మాట్లాడటంపై పలువురు మహిళలు స్పందించారు. ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.