ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గత ప్రభుత్వం తాగునీటి నిర్వహణను గాలికి వదిలేసింది : మంత్రి వాసంశెట్టి - Minister Subhash Inspected GGH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 6:55 PM IST

Minister Subhash Inspected GGH in Kakinada (ETV Bharat)

Minister Vasamsetti Inspected GGH in Kakinada : వైసీపీ ప్రభుత్వం తాగునీటి నిర్వహణ గాలికి వదిలేయడంతో, నీరు కలుషితమై ప్రజలు డయేరియా బారినపడుతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైఎస్సార్సీపీ పాలనలో అవినీతి పరులు ప్రతిశాఖలో చేరారని ఆరోపించారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు గురించి మంత్రి వాసంశెట్టి ఆరా తీశారు. 

ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు 24 గంటలు వైద్యసేవలు అందేలా సిబ్బంది అందుబాటులో ఉండాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని ఆసుపత్రి సూపరింటెండెంట్​కు మంత్రి సూచించారు. జగన్​మోహన్​రెడ్డి పంచాయతీ నిధులను పక్కదారి పట్టించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details