తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆగస్టు 10లోగా సీతారామ కాలువ పనులు పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల - Tummala on Sitarama Canal Works - TUMMALA ON SITARAMA CANAL WORKS

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 7:45 PM IST

Minister Tummala on Sitarama Canal Works : సీతారామ అనుసంధాన కాలువ పనులు ఆగస్టు 10లోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఇమామ్​నగర్ వద్ద కొనసాగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. ఈ నేపథ్యంలో గ్యాస్​లైన్ వద్ద చేపడుతున్న సొరంగం పనులను ఆయన సందర్శించి అధికారులతో మాట్లాడారు. పనుల నిర్వాహణకు గ్యాస్​లైన్ అధికారులతో పాటు అన్ని వైపుల నుంచి పూర్తి అనుమతులు ఉన్నాయని, పనులు వేగవంతం చేయాలన్నారు.

ప్రకటించిన విధంగా ఆగస్టు 15లోగా నీటి సరఫరా అయ్యేలా అధికారులు దృష్టి సారించాలని, అవసరమైన మేరకు యంత్రాలు సమకూర్చాలని మంత్రి తుమ్మల సూచించారు. అంతకుముందు తల్లాడ మండలం బిల్లుపాడులో అనారోగ్యంతో మృతి చెందిన తన ఆత్మీయ మిత్రుడు జక్కంపూడి కృష్ణమూర్తి అంతిమయాత్రలో పాల్గొన్నారు. దశాబ్దాలుగా తనతో ఉన్న మిత్రుడు తనువు చాలించడంతో ఒక్కసారిగా మంత్రి తుమ్మల భావోద్వేగానికి గురయ్యారు. మిత్రుడిని కడసారి చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details