మంత్రిగా తొలిసారి పెనుకొండకు సవిత - ఘనస్వాగతం పలికిన కూటమి శ్రేణులు - Savitha Grand Welcome in Penukonda - SAVITHA GRAND WELCOME IN PENUKONDA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 7:49 PM IST
Minister Savitha Grand Welcome in Penukonda : రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసేలా కృషిచేస్తానని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమెకు కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అమరావతి నుంచి విమానంలో మంత్రి బెంగుళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన బాగేపల్లి టోల్‌ప్లాజా నుంచి ర్యాలీగా వెళ్లారు.
Minister Savitha Huge Rally in Penukonda : మార్గమధ్యంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై కూటమి కార్యకర్తలు గజమాలలతో మంత్రి సవితకు స్వాగతం పలికారు. బాణసంచా కాల్చుతూ కూటమి నాయకులు, శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం సోమందేపల్లి పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇచ్చారు. తనను గెలిపించిన పెనుకొండ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని మంత్రి సవిత పేర్కొన్నారు.