ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు - తిరిగి గాడిలో పెట్టగలిగే సత్తా ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది' - Minister Savitha fire on YCP - MINISTER SAVITHA FIRE ON YCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 5:50 PM IST

Minister Savitha Fire on Previous YCP Government : గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గంజాయి, శాండ్, ల్యాండ్ మాఫియాలతోనే పాలన సాగించారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత ఆరోపించారు. అనంతపురంలో ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. కేవలం ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టగలిగే సత్తా కేవలం సీఎం చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉందని తెలిపారు. వసతి గృహాల్లో పేద విద్యార్థులకు డైట్ ఛార్జీలు కూడా చెల్లించని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని ప్రశ్నించారు.

నా బీసీలంటూ చెప్పుకుంటూ తిరిగే జగన్ వారినే తీవ్రంగా మోసం చేశారన్నారు. చంద్రబాబు సీఎం బాధ్యతలు చేపట్టిన రోజూ నుంచే రాష్ట్రంలో అభివృద్ధి మొదలైందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు కాకముందే రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయగలిగే సామర్థ్యం ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని మంత్రి సవిత తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details