LIVE: మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పార్థసారథి - ప్రత్యక్ష ప్రసారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago
|Updated : 4 hours ago
LIVE : ఏపీ సీఆర్డీయే పరిధి కుదిస్తూ గత జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ మంత్రి వర్గం రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. పల్నాడు పరిధిలోని 92 గ్రామాలను, ఆరు మండలాలను, బాపట్ల జిల్లాలోని 62 గ్రామాలు, ఐదు మండలాలను గత వైకాపా ప్రభుత్వం సీఆర్డీయే పరిధి నుంచి తొలగించి పల్నాడు ఏరియా అర్బన్ డెవలప్ మెంట్ అథారటీ, బాపట్ల ఏరియా అర్బన్ డెవలప్ మెంట్ అథారటీల్లో కలిపింది. రాజధాని అమరావతి ప్రాధాన్యం తగ్గిస్తూ సిఆర్ డీఏ పరిధిని కుదించేలా గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శాలే వెల్లువెత్తాయి. మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం సీఆర్ డీఏ పరిధిని తిరిగి పునరుద్దరించేలా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కొత్తగా పిఠాపురం కేంద్రంగా పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్ మెంట్ అథారటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అలాగే గత ప్రభుత్వం తీసుకువచ్చిన మరో చీకటి నిర్ణయమైన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ నింబంధనలను తొలగిస్తూ ఇవాళ్టి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి వివరిస్తున్నారు. మీ కోసం ప్రత్యక్ష ప్రసారం
Last Updated : 4 hours ago