త్వరలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటి విడుదల- అధికారులతో మంత్రి సమీక్ష - Nimmala Ramanaidu Review
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 5:25 PM IST
Minister Nimmala Ramanaidu Review with Water Resources Officials : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా ఇన్ ఫ్లో తరలివస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటి విడుదలపై మంత్రి రామానాయుడు సమీక్షించారు. సాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టా, కుడి కాల్వకు కృష్ణా యాజమాన్య బోర్డుకు తెలియజేసి నీటిని విడుదల చేయాలని మంత్రి నిమ్మల నిర్ణయించారు. త్వరలో విడుదలయ్యే నీటిని తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేలా సద్వినియోగం చేసుకునేలా ఆయా జిల్లాల సాగునీటి సలహా మండలిలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విజయవాడ క్యాంపు ఆఫీసులో జలవనరుల అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు.
కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) కుడి కాలువల ఆయకట్టుకు సాగు, తాగు నీటి విడుదలపై జల వనరుల అధికారులతో మంత్రి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, సలహాదారులు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ రామ సుందర్ రెడ్డి, సీఈలు, ఎస్ఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.