ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మరుగుదొడ్ల ఫొటోలు తీయాల్సిన అవసరం లేదు - నాణ్యమైన విద్య పిల్లలకు అందించండి: మంత్రి లోకేశ్ - Lokesh on Teachers Problems - LOKESH ON TEACHERS PROBLEMS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 1:43 PM IST

Minister Nara Lokesh on Teachers Problems: ఉపాధ్యాయులు ఇకపై మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ విధానాన్ని ఆపేశామని, ఐఎంఎంఎస్ యాప్​లో ఈ ఆప్షన్​ను కూడా తొలగించినట్లు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్​లో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లోకేశ్ సూచించారు. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. టీచర్ల సమస్యలన్నీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. 

"ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫొటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదు. ఈ విధానాన్ని ఆపేశాం. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలగించాం. నాణ్యమైన విద్యను పిల్లలకి అందించండి. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దండి. టీచర్ల సమస్యలన్నీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత మేం తీసుకుంటాం." - మంత్రి నారా లోకేశ్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details