ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అలీప్​ను ఏపీలో కూడా అమలు చేయాలని కోరాం: మంత్రి శ్రీనివాస్​ - Minsiter Srinivas Visit Aleap - MINSITER SRINIVAS VISIT ALEAP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 8:01 PM IST

Minister Kondapalli Srinivas Visit ALEAP in Hyderabad : హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్​లో ఉన్న అలీప్ (Association of Lady Entrepreneurs of India) ​సముదాయంను ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇండస్ట్రీస్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్​తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అలీప్​లో 32 సంవత్సరాలుగా మహిళలు అభివృద్ధే లక్ష్యంగా దశల వారీగా ఎదుగుతున్నారని ఆయన అనారు. అలీప్​ ద్వారా కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలు, ఆలోచనలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. 

ఏపీలో కూడా ఈ తరహా సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందుకు పూర్తి సహకారాలు అందిస్తామని మంత్రి శ్రీనివాస్​ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. గతంలో తెలుగుదేశం హయాంలో చిన్న తరహా పరిశ్రమలకు కేటాయించిన స్థలాలు ఉన్నాయన్నారు. ఈ సంస్థలో వారు ప్రతి కంపెనీని ఎలా ప్రమోట్​ చేస్తున్నారో తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ సంస్థను ఏపీలో కూడా అమలు చేసేందుకు సందర్శించడం జరిగిందన్నారు.  

ABOUT THE AUTHOR

...view details