ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - Minister Komatireddy Venkat Reddy
Published : Jan 21, 2024, 10:53 PM IST
Minister Komatireddy Venkat Reddy Fires On BRS : బీఆర్ఎస్పై లండన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు, కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా కేటీఆర్ మాటతీరులో మార్పురాకపోవడం దారుణమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
Minister Komatireddy Venkat Reddy On RRR Road : ట్రిపుల్ ఆర్(RRR)తెలంగాణకు మణిహారం అని, అలైన్‌మెంట్ మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు. ఆ విషయంపై ఇప్పటికే అధికారులతో సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని గులాబీ నాయకులు వ్యాఖ్యానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను తాము అమలు చేస్తామని స్పష్టం చేశారు.