తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

ETV Bharat / videos

LIVE : మూసీనది ప్రక్షాళనపై మంత్రి కోమటిరెడ్డి ప్రెస్​మీట్​ - Komatireddy On Musi Prakshalana

Minister Komatireddy Pressmeet Live : మూసీనది ప్రక్షాళనపై బీఆర్ఎస్​ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తిప్పికొట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే బీఆర్ఎస్​ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రేటర్​ హైదరాబాద్​ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే మూసీనదిని ప్రక్షాళన చేస్తున్నామన్నారు. నిర్వాసితులందరికీ తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి చెబుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్​, హరీశ్​రావులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రులమంతా కృషి చేస్తున్నామని వివరించారు. మూసీ ప్రక్షాళన విషయంలో తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. మూసీనది ప్రక్షాళనపై హైదరాబాద్​లో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు.
Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details