ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బెదిరిన ఎద్దు - మంత్రి డోలాకు స్వల్ప గాయాలు - తప్పిన పెను ప్రమాదం - Minister Dola Injured

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 12:05 PM IST

Dola Bala Veeranjaneya Swamy Injured (ETV Bharat)

Minister Dola Injured : సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపులకు ఆదివారం రాత్రి మంత్రి హాజరయ్యారు. ఈ క్రమంలోనే భోజనం తర్వాత గ్రామస్థులు ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల ముందు స్థానిక నేతలు, యువత మంత్రితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఇంతలోనే డీజే సౌండ్​కు ఎద్దు బెదిరిందింది.

Dola Bala Veeranjaneya Swamy Updates : ఈ క్రమంలో బండి ముందు ఉన్న డోలా బాలవీరాంజనేయస్వామిని ఎద్దు కొమ్ముతో నెట్టింది. దీంతో ముందుకు బోర్లా పడిన ఆయన వీపుపై ఎద్దు ముందు కాళ్లతో తొక్కింది. ఈ హఠాత్పారిణామంతో అక్కడి వారు కంగుతిన్నారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది, నాయకులు దానిని అడ్డుకుని మంత్రిని ప్రమాదం నుంచి తప్పించారు. స్వల్పంగా గాయపడిన ఆయణ్ని వాహనంలో ఒంగోలులోని ఇంటికి తీసుకెళ్లారు. వైద్యులు అక్కడికి చేరుకుని డోలా బాలవీరాంజనేయస్వామికి చికిత్స అందించారు. మరోవైపు మంత్రి స్వల్ప గాయాలతో బయటపడటంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details