త్వరలో అన్ని జిల్లాల్లో భరోసా కేంద్రాల ఏర్పాటు : మంత్రి దామోదర - భరోసా కేంద్రాన్ని ప్రారంభం దామోదర
Published : Feb 15, 2024, 2:28 PM IST
Minister Damodara Inaugurated Bharosa Center in Medak : మహిళలు, చిన్నారులు ఎలాంటి వేదనకు గురికాకుండా ప్రభుత్వ యంత్రాంగం మేమున్నామని తెలిపేదే భరోసా కేంద్రం అని మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. మెదక్లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే రోహిత్ రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భరోసా కేంద్రాలు చేస్తున్న పనులను వివరించారు. వారి ముఖ్య ఆలోచన మహిళలలు, పిల్లలు ఎలాంటి అత్యాచారాలను గురైన తక్షణమే వారిని ఆదుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేసి ఆసుపత్రిలో చికిత్స అందించాలి.
అలాగే కేసు నమోదు అయిన తర్వాత వారికి ఆర్థికంగా సహాయం చేయాలి. చివరగా తీర్పు వచ్చినప్పుడు సంపూర్ణ ఆర్థిక మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 135 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారందరికి సుమారు రూ.27లక్షల పైచిలుకు ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పారు. మహిళలు పిల్లలు ఎలాంటి మానసిక వేదనకు గురికాకుండా కాపాడే విధంగా ఈ భరోసా సెంటర్ పని చేస్తుందని తెలిపారు. ఈ కేంద్రాలు లేని జిల్లాల్లో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.