ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖలో అట్టహాసంగా మిలన్ 2024 - అబ్బురపరుస్తోన్న విన్యాసాలు - Chetak Helicopters

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 9:38 PM IST

milan submarine rescue demo : మిలన్ 2024 లో పాల్గొనేందుకు వివిధ దేశాల నేవీ అధికారులు విశాఖ చేరుకున్నారు. నిన్నటి నుంచి హార్బర్ దశ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారత నౌకా దళ పాఠవాన్ని ఇక్కడి సదుపాయాలను ఇతర నేవీ లకు పరిచయం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ తీరానికి వచ్చిన సబర్మతి (Sabarmati) నౌక లో సమకూర్చిన సబ్ మెరైన్ రెస్క్యూ వాహకం (Submarine Rescue Carrier) ఎలా పనిచేస్తుందని అంశాన్ని ఇతర నౌకా తల సిబ్బందికి పరిచయం చేసే కార్యక్రమం నిర్వహించింది. 

విశాఖ ఆర్‌కే బీచ్‌లో మిలన్ విన్యాసాల రిహార్సల్స్ అలరించాయి. నౌకా యుద్ధ విమానాలు, చేతక్ హెలికాప్టర్ల (Chetak Helicopters) అద్భుత ప్రదర్శన చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. పీఐ 8 హెలికాఫ్టర్లు, సీకింగ్ హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ సిటీ పరేడ్‌లో భాగంగా పలుదేశాల నేవీ బృందాల ప్రదర్శన విశాఖలో కొనసాగుతోంది. మిలన్‌ విన్యాసాల సందర్భంగా లేజర్ షో ఆకట్టుకుంది. 

ABOUT THE AUTHOR

...view details