తెలంగాణ

telangana

ETV Bharat / videos

బర్త్ డే స్పెషల్ - ఫ్యామిలీతో కలిసి తిరుమలలో మెగాస్టార్ చిరంజీవి - CHIRANJEEVI VISITS TIRUMALA TEMPLE - CHIRANJEEVI VISITS TIRUMALA TEMPLE

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 12:11 PM IST

Megastar Chiranjeevi Visits Tirumala With Family Today : సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 69వ జన్మదినం సందర్భంగా చిరంజీవి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటు సతీమణి సురేఖ, తల్లి అంజనా దేవి, కుమార్తె శ్రీజ, మనవరాలు ఉన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం  గర్భాలయంలో  స్వామివారిని దర్శించుకొని మెగాస్టార్ చిరంజీవి, కుటుంబ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. మెగాస్టార్ చిరంజీవిని చూసేందుకు అభిమానులు, జనసేన నాయకులు  భారీగా తరలివచ్చారు. కాసేపు ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం ఏర్పడింది. 

శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం రాత్రే తిరుమలకు చేరుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలలోనే బస చేసి, నేడు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు చిరు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇంద్ర సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details