మేడారం పరిధిలో ఆ పర్యాటక ప్రాంతాలు మూసివేత - ఏ రోజున తెరుచుకుంటాయంటే? - mulugu tourist places closed
Published : Feb 24, 2024, 2:57 PM IST
Medaram Tourist Places Closed Till 26th Feb : మేడారం మహాజాతరను పురస్కరించుకుని అధికార యంత్రాంగం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మార్గమధ్యలో పర్యాటక స్థలాలను సందర్శించకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. రామప్ప, లక్నవరం వద్ద ఉన్న జలాశయాల్లో బోటింగ్‌ను నిలిపివేశారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయి విధుల్లో ఉంటారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
మేడారం జాతర జరిగే నాలుగు రోజులు కోట్లాది భక్తుల వస్తారు. సామాన్యంగా అమ్మవార్లను దర్శించున్న భక్తులు చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి మక్కువ చూపిస్తారు. దీంతో ఈ సమయంలో ప్రజలు చెరువు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తే ప్రమాదాలు సంభవిస్తాయన్న యోచనలో అధికారులు ప్రస్తుతానికి మూసి వేశారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించుకునే అవకాశం కల్పించారు. రామప్ప చెరువు దగ్గరకి ఎవ్వరిని అనుమతించడం లేదు. మూసేసిన పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను ఈనెల 27 నుంచి అనుమతించనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తున్నారు.