ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'మహిళలకు రక్షణ ఏది ?' - మంగళగిరిలో వైద్య విద్యార్థులు ఫ్లాష్ మాబ్ - Strike on Kolkata Incident - STRIKE ON KOLKATA INCIDENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 2:23 PM IST

Medical Students Flash Mob on Kolkata Incident: కోల్‌కతాలో వైద్యురాలిపై అమానుష ఘటనను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్యులు రోడ్డెక్కారు. వైద్యులపై దాడులు నశించాలంటూ ఎన్​ఆర్​ఐ ఆస్పత్రి మెడికోలు ర్యాలీ చేపట్టారు. వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళగిరి వైద్య విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా మహిళలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. వైద్యుల ఆందోళనకు ఏపీ కౌలు రైతు సంఘం ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. మహిళా డాక్టర్ల​పై హత్యాచార ఘటనలను అరికట్టి, వైద్యులకు రక్షణ కల్పించే చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా కోల్​కతా ఆర్​జీకార్​ వైద్య కళాశాల ఆసుపత్రిలోని జూనియర్ వైద్యురాలిపై హత్యాచారాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ  వైద్య సేవలు నిలిపివేసి రోడ్డెక్కారు. 

ABOUT THE AUTHOR

...view details