ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏలూరులో రెచ్చిపోయిన దుండగలు - ఓ వ్యక్తిపై పెట్రోల్​ పోసి నిప్పు - Thugs Severely Beaten And Attack

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 4:53 PM IST

Thugs Severely Beaten And Attack With Petrol: ఏలూరులో ఓ వ్యక్తిని కొందరు దుండగులు తీవ్రంగా కొట్టి పెట్రోల్‌తో దాడి చేశారు. కాళ్లపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయయ్యారు. గాయపడిన గోపిని స్థానికులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరులో నివాసముంటున్న గోపి అనే వ్యక్తి విజయవాడలోని ఓ హోటల్​లో పని చేస్తున్నాడు. 

సోమవారం రాత్రి అతను విధులు ముగించుకుని విజయవాడ నుంచి ఏలూరు పాత బస్టాండ్‌కు చేరుకున్నారు. పాత బస్టాండ్‌ సమీపంలో బిర్యానీ తీసుకొని తింటుండగా కొందరు దుండగులు మూక్కుమ్మడిగా చేరి పక్కన ఉన్న వ్యక్తి నుంచి సెల్ ఫోన్ తీసుకుని రమ్మని బెదిరించారని గోపి తెలిపారు. సెల్​ఫోన్​ తీసుకువచ్చే సందర్భంలో తనపై పెట్రోల్​ పోసి దాడి చేశారని బాధితుడు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానిక పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడిన వారి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

ABOUT THE AUTHOR

...view details