ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రైల్లో విద్యార్థిని పట్ల ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తన - పట్టుకుని పోలీసులకు అప్పగింత - Man Misbehaved With a Student - MAN MISBEHAVED WITH A STUDENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 12:09 PM IST

Man Misbehaved With Student in Train : ఆడవారికి ఎక్కడా భద్రత లేకుండాపోయింది. కనీసం బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయాలన్నా ఆడపిల్లలు భయపడే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైల్లో ఓ విద్యార్థినిపై తెల్లవారు జామున రెెండు గంటల సమయంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు వెంటనే అప్రమత్తమై దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునే లోపు నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. విద్యార్థిని అరుపులతో అదే కోచ్‌లో ఉన్న విద్యార్థి సంఘం నాయకుడు సాయి కుమార్​ నిందితుడిని పట్టుకొని రైల్వే పోలీసులకు అప్పగించారు.  

ఈ క్రమంలో విద్యార్థి సంఘం నాయకుడు సాయి కుమార్​ మాట్లాడుతూ ప్రయాణికులకు భద్రత కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు రక్షణ కల్పించే ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details