తెలంగాణ

telangana

LIVE : టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు - TPCC CHIEF MAHESH KUMAR LIVE

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 3:45 PM IST

Updated : Sep 15, 2024, 5:24 PM IST

Mahesh Kumar Goud (ETV Bharat)
LIVE : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన బొమ్మ మహేశ్​ కుమార్‌ గౌడ్‌ ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నుంచి మహేశ్ కుమార్‌ గౌడ్‌ పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మొదట  అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌ పార్క్‌ వద్దకు ఆయన చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో కలిసి అమరువీరుల స్థూపం వద్ద మహేశ్​ కుమార్ గౌడ్‌ నివాళులు అర్పించారు. ఆ తర్వాత అక్కడ నుంచి గాంధీభవన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్సీ సమక్షంలో రేవంత్‌ రెడ్డి వద్ద నుంచి మహేశ్​ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు తీసుకున్నారు. అక్కడే పీసీసీ అధ్యక్షుడికి చెందిన కుర్చీని మహేశ్​కుమార్ గౌడ్​కు రేవంత్‌ రెడ్డి అప్పగించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొని మాట్లాడారు.
Last Updated : Sep 15, 2024, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details