ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వ్యవసాయ విద్యుత్​కు లో-వోల్టేజ్ గ్రహం- ఎండుతున్న పంటలతో రోడ్డెక్కిన రైతన్నలు - Farmers concerns in Mudigubba

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 10:28 PM IST

Low Electricity Problems for Farmers in Sathya Sai District : సత్యసాయి జిల్లాలో విద్యుత్తు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. లో-వోల్టేజ్​తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతొందని మండిపడ్డారు. దీంతో జిల్లాలోని ముదిగుబ్బ మండలంలోని అనంతపురం - చెన్నై జాతీయ రహదారిపై రైతులు పెద్దఎత్తున బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లో-వోల్టేజ్​తో విద్యుత్తు మోటార్లు సరిగ్గా ఆడక ఆగిపోతున్నాయని తెలిపారు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీరు లేక కళ్ల ముందే ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు.

Farmers Concerns in Mudigubba Mandal : రైతులు చేస్తున్న ఆందోళనలకు పలు రాజకీయ పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. దీంతో అక్కడ ఉదృత వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వనికి వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున రోడ్డుపై చేరి ఆందోళనలు చేపట్టాడంతో సుమారు గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా సక్రమంగా విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details