ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

501 రూపాల్లో బొజ్జ గణపయ్య - కనులారా వీక్షిస్తున్న భక్తులు - GANESH 501 VARIETY IDOLS - GANESH 501 VARIETY IDOLS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 4:49 PM IST

Lord Ganpati Appearing in 501 Forms at Vizianagaram District : రాష్ట్రవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలంతా వాడవాడలా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ఎంతో కనులవిందుగా పండుగను జరుపుకుంటున్నారు. 'గణపతి బప్పా మోరియా' అంటూ నినాదాలతో రాష్ట్రం హోరెత్తిపోంది. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక మాజీ అధ్యక్షురాలు తూముల అచ్యుత వల్లి వినూత్నంగా ఆలోచించారు. తన ఇంట్లో 501 వినాయక విగ్రహాలను కొలువు తీర్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన విగ్రహాలను ఆమె నెలకొల్పారు. దీంతో వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న గణపయ్యను చూసేందుకు భక్తులు భారీగా అచ్యుత వల్లి ఇంటికి తరలివస్తున్నారు.    

ఈ సందర్భంగా తూముల అచ్యుత వల్లి మాట్లాడుతూ " ఏటా వినాయక చవితి సందర్భంగా వివిధ రూపాల్లో ఉన్న గణపతుల విగ్రహాలను ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్దఎత్తున వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ వివిధ రూపాల్లో ఉన్న వినాయక బొమ్మలను కొనటం అలవాటుగా ఉంది. వివిధ ఆకృతుల్లో ఉన్న గణనాథులను ఒక్కచోట కొలువు తీరిస్తే భక్తులు చూస్తారనే ఉద్దేశంతో ఇంట్లో ఏర్పాటు చేశా" అని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details