మహిళలకు సహాయం చేసేందుకు చంద్రబాబు ఎప్పుడూ వెనుకాడరు: బ్రాహ్మణి - Brahmani Meet womens in Mangalagiri - BRAHMANI MEET WOMENS IN MANGALAGIRI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 22, 2024, 7:43 AM IST
Lokesh Wife Nara Brahmani Election Campaign: ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే, తన విజయం వెనుక నారా లోకేశ్ ఎప్పుడూ ఉన్నారని నారా బ్రాహ్మణి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో స్త్రీ శక్తి పథకంలోని లబ్దిదారులతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తారని తెలిపారు. మహిళలకు ఎంతైనా సహాయం చేసేందుకు వెనుకాడరని ఆమె స్పష్టం చేశారు. మంగళగిరిలో లోకేశ్ 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మంగళగిరికి ఇంత చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత చేస్తారనేది మీ ఊహకే వదిలేస్తున్నానని ఆమె అన్నారు. స్త్రీ పథకంలో కుట్టుమిషన్ నేర్చుకున్న మహిళలను మరింత ప్రోత్సహించేందుకు భవిష్యత్తులో పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకుబోతున్నామన్నారు. ఆయా సంస్థలకు కావాల్సిన వస్త్రాలను మీ ద్వారానే కుట్టించి వాటికి మార్కెట్ సదుపాయం కల్పించే బాధ్యతను లోకేశ్ తీసుకుంటారని బ్రహ్మణి అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో మంగళగిరి ముందు ఉండాలంటే నారా లోకేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని బ్రాహ్మణి కోరారు.