కొండా రెడ్డి బురుజుపై లైటింగ్ షో- సీఎం జగన్ చిత్రాన్ని ప్రదర్శించిన అధికారులు - కర్నూలులో లైటింగ్ షో
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 9:02 AM IST
Lighting Show on Konda Reddy Fort : కర్నూలులో కొండారెడ్డి బురుజుపై నగరపాలక సంస్థ అధికారులు అత్యుత్సాహం చూపారు. కర్నూలు అంటేనే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కొండారెడ్డి బురుజు. అలాంటి చారిత్రక కట్టడంపై సీఎం జగన్ చిత్రాన్ని ప్రదర్శించారు. కొండారెడ్డి బురుజు సమీపంలో 2కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. అభివృద్ధి చేసిన పార్కును మేయర్ బీవై రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరులు ఆదివారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొండారెడ్డి బురుజుపై లేజర్ లైటింగ్, సౌండ్ షో, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
లేజర్ లైటింగ్ షోను కొండారెడ్డి బురుజుపై చూసేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కడికి వచ్చిన వారంతా చరవాణిల్లో ఆ లేజర్ లైటింగ్‌ను చిత్రీకరించారు. లేజర్ లైటింగ్ అనంతరం చారిత్రక కట్టడంపై పెద్ద ఎత్తున రంగు రంగుల బాణ సంచాను కాల్చారు. అనంతరం యువ గాయకులు సినిమా పాటలు పాడుతూ అందరినీ ఆలపించారు. ఈ కార్యక్రమంలో కొండారెడ్డి బురుజుపై లైట్ల ద్వారా సీఎం జగన్ చిత్రం వేయడమేంటని పలువురు ప్రశ్నిస్తూ అధికారుల తీరును తప్పుపడుతున్నారు.