ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చిక్కని చిరుత- కడియం నర్సరీల్లో కొనసాగుతున్న అధికారుల ప్రయత్నాలు - Leopard Roaming in Kadiyam Nursery - LEOPARD ROAMING IN KADIYAM NURSERY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 8:04 PM IST

DFO Prasada Rao Interview on Leopard Roaming: తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం గత కొన్ని రోజులగా స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిరుతను బంధించలేక పోతున్నారు. ప్రతిసారి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత అధికారులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా మరోసారి రూటు మార్చి గత మంగళవారం నుంచి కడియం నర్సరీల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయినా కూడా జాడ దొరకలేదు. 

చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిరుత ఆచూకీ కోసం 20 ట్రాప్, 10 సీసీ కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశారు. అయితే వర్షం పడటంతో కడియపులంకలో చిరుత పాదముద్రలు సైతం దొరకలేదు. చిరుత సంచారంతో కడియపులంక పరిసరాల్లో నర్సరీ పనులకు ఆటంకం కలుగుతోంది. చిరుత ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా డీఎఫ్ఓ ప్రసాదరావుతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details