రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ లేఖ - షరీఫ్ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 10:43 AM IST
Legislative Council EX-Chairman M.A Sharif Letter To Election Commission : రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలోని అవకతవకలను పునఃసమీక్షించాలని కోరుతూ శాసనమండలి మాజీ ఛైర్మన్ M.A షరీఫ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి (Chief Electoral Officer of the State) లేఖ రాశారు. జనవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత ఫామ్-6, 7, 8, 8A లపై అనేక ఫిర్యాదులు చేశామని లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదుల తాలూకు ఎటువంటి సమాచారం ఎన్నికల సంఘం వెబ్ పోర్టల్‌లో (Web portal) పొందుపరచలేదని తెలిపారు.
పేర్లు సరిదిద్దటం, ఓట్ల తొలగింపు, చేర్పులుపై వివరాలు అప్‌డేట్ చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ (Demond) చేశారు. రాజానగరం అసెంబ్లీ ఓటర్ల లిస్టులోని డబుల్, ట్రిపుల్ ఎంట్రీలను తొలగించాలని అక్కడి ఈఆర్ఓ (ERO), ఏఈఆర్ఓ (ARO)లను ఆదేశించాలన్నారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 2,287 మరణించిన వారి ఓట్లు, 3,318 డబుల్ ఓట్లు తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.