యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఘనంగా లక్ష పుష్పార్చన - Laksha Pushparchana Special Rituals - LAKSHA PUSHPARCHANA SPECIAL RITUALS
Published : Apr 5, 2024, 4:22 PM IST
Laksha Pushparchana Special Rituals In Yadadri Temple : ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష పుష్పార్చన పూజలను వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ అర్చకులు విశిష్ఠతను తెలియజేశారు.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజలు ఘనంగా జరిగాయి. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రీశునికి, అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలను ఘనంగా జరిపించారు వేదపండితులు. సుమారు గంట పాటు ఆలయ అర్చకులు, వేదపండితులు వేద మంత్రోచ్ఛరణల, సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ నరిసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే భక్తులతో ఆలయ ఈవో భాస్కర్ రావు మాట్లాడి వారి నుంచి సూచనలు స్వీకరించారు.