తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : హైదరాబాద్​లో కేటీఆర్​ మీడియా సమావేశం - KTR PRESS MEET AT HYDERABAD LIVE - KTR PRESS MEET AT HYDERABAD LIVE

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 2:21 PM IST

KTR Press Meet at Hyderabad : అసెంబ్లీ ఆవరణలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్​ గాంధీ విగ్రహం ఏర్పాటుపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో రాజీవ్​ గాంధీ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికే కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడు నెలలు అయినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. మరోవైపు రైతు రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్​ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారన్నారు. పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేయకుండా రైతులను కాంగ్రెస్​ పార్టీ దగా చేస్తోందని విమర్శించారు. కేవలం రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేసి ఇంకా సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. మహిళలకు రూ.2500 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే వారికి ఇచ్చారని, మహిళ ఉచిత బస్సు ప్రయాణంపై తప్పుగా మాట్లాడితే క్షమాపణలు చెబుతున్నట్లు ఎక్స్​ వేదికగా తెలిపారు. హైదరాబాద్​లోని తన నివాసంలో ఈ మీటింగ్​ను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details