LIVE : చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశం - KTR LIVE - KTR LIVE
Published : Mar 29, 2024, 1:40 PM IST
|Updated : Mar 29, 2024, 2:05 PM IST
KTR Live : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురైనా, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భారత్ రాష్ట్ర సమితి భావిస్తోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని తమ ఓటమి తాత్కాలికమేనని నిరూపించేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని 17 స్థానాలకు వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ నుంచి బోయినిపల్లి వినోద్ కుమార్ బరిలో దిగుతున్నారు. మరో కీలక స్థానమైన నిజామాబాద్ నుంచి సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీగా పోటీ చేస్తున్నారు.జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, మెదక్ నుంచి పి.వెంకట్రామి రెడ్డి పోటీలో నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను, మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపుతోంది. ఈ క్రమంలోనే నేడు ఏర్పాటు చేసిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అభ్యర్థి గెలుపు కోసం నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
Last Updated : Mar 29, 2024, 2:05 PM IST