ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కృష్ణపట్నం పోర్టు కూడా తరలిపోతే రాష్ట్రానికి మిగిలేది బొగ్గు, బూడిదే : సోమిరెడ్డి - Krishnapatnam Port Employees dharna

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 4:56 PM IST

Krishnapatnam Port Container Terminal Closure Efforts by Employees on Dharna : నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ మూసివేత ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోర్టు అనుబంధ ఏజెన్సీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. టెర్మినల్ మూతపడితే తామంతా రోడ్డును పడతామంటూ వారు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఏజెన్సీ ఉద్యోగుల ఆందోళనకు అఖిల పక్ష నేతలు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తోపాటు బీజేపీ, వామపక్ష, కాంగ్రెస్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. 

కృష్ణపట్నంలో కేవలం బూడిద రవాణాను మాత్రం ఉంచి, కంటైనర్​ను తమిళనాడుకు తరలిస్తున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. కంటైనర్​పై పట్టు తగ్గిపోతుందని స్పష్టమైన సంకేతాలు ఉన్నా స్థానిక మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం దారుణం అన్నారు. పోర్టు వద్ద మంత్రి అనధికారి టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమ వసూళ్ల వల్లే టెర్మినల్ తరలిస్తుంటే, తాము ఆ టోల్ గేటును అడ్డుకుంటామని ప్రకటించారు. ఉపాధి, ఆదాయ అవకాశాలను అందిస్తూ నెల్లూరు జిల్లాకు తలమానికంగా ఉన్న పోర్టును తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కంటైనర్ టెర్మినల్ ను కాపాడుకునేందుకు పోరాడుతామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details