ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 11:13 AM IST

ETV Bharat / videos

కృష్ణలంక పోలీస్ స్టేషన్​లో సీపీ ఆకస్మిక తనిఖీ- సీఐ హెడ్​ క్వార్టర్స్​లో రిపోర్ట్ చేయాలని ఆదేశం - CP Inspected krishna Lanka PS

krishna CP Inspected krishna Lanka Police Station : విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్​లో సీపీ రాజశేఖరబాబు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అడిగిన వివరాలు అందించలేని కృష్ణలంక సీఐ (CI) మురళీకృష్ణ పనితీరు పట్ల  సీపీ(CP) అసంతృప్తి వ్యక్తం చేశారు. కంప్యూటర్‌లోని సీసీటీఎన్​ఎస్​ (Crime and Criminal Tracking Network and Systems) ఓపెన్ చేసి ఎస్​హెచ్​ఓ (Station House Officer) రోల్ గురించి లాగిన్ అవ్వాలని సీఐను సీపీ ఆదేశించారు. సీపీ ఆదేశానికి అనుగుణంగా సీఐ స్పందించలేకపోయారు. అదే విధంగా స్టేషన్ పరిధిలోని మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల వివరాలు అడగ్గా సీఐ సరైన సమాధానం చెప్పకుండా నీళ్లు నమలటంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల వివరాలు, వాటి సామర్థ్యం, పనితీరు గురించి సీఐ చెప్పలేకపోవడంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మురళీకృష్ణను హెడ్​ క్వార్టర్స్​లో రిపోర్ట్ చేయాలని సీపీ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details