ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆశ్రమం ఆర్థిక వనరులను దోచుకోవడానికి వైసీపీ సహకరిస్తుంది: పీఠాధిపతి - వైసీపీ అండతో ఆశ్రమ వనరులను దోపిడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 9:59 PM IST

Konakanwa Ashram Financial Resources Looted: కోనకన్వా ఆశ్రమ ఆర్థిక వనరులను అధికార పార్టీ అండతో ఆశ్రమ సభ్యులు దోచుకుంటున్నారని పీఠాధిపతి దత్త నందగిరి స్వామీజీ ఆరోపించారు. ఆశ్రమం వనరులను రక్షించాలని జిల్లా కలెక్టర్ అరుణ్‌ బాబుకు వినతిపత్రం అందజేశారు. పీఠాధిపతి తెలిపిన వివరాలు ప్రకారం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కోనకన్వా పీఠాధిపతిగా ఉన్న విష్ణు దాసు స్వామీజీ వారు శివైక్యం చెందడంతో తాను పీఠాధిపతిగా మూడు సంవత్సరాల నుంచి ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని తెలిపారు.

Peetadhipathi Datta Nandagiri Swamiji: ఆశ్రమం సభ్యులుగా ఉన్న చంద్రారెడ్డి, ముత్యాలమ్మ, మరి కొందరు కలిసి కొద్దిరోజుల క్రితం ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆశ్రమం ఆర్థిక వనరులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల పాసుబుక్కులు, సుమో వాహనం తాళం చెవులు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్కులు దౌర్జన్యంగా లాక్కొన్నారని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బ తిసేలా ప్రవర్తిస్తున్నారని పీఠాధిపతి ఆరోపించారు. ఈ కమిటీని తక్షణమే రద్దు చేసి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. పవిత్రమైన ఆశ్రమంలో రాజకీయానికి చోటు లేదని ఆశ్రమాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచాలని పీఠాధిపతి కోరారు. 

ABOUT THE AUTHOR

...view details