ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అర్ధరాత్రి ఇళ్ల పట్టాలపై సంతకాలు - తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కొల్లు రవీంద్ర ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 11:46 AM IST

Published : Mar 15, 2024, 11:46 AM IST

Kollu Ravindra Protest MRO Office in Machilipatnam : అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారం అడ్డదారులు తొక్కుతుంటే అందుకు కొంత మంది అధికారులు సహకరిస్తున్న విషయం మచిలీపట్నంలో ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ నాయకుల ఆదేశాలే శిరోధార్యంగా మచిలీపట్నం తహసీల్దార్​ కార్యాలయం అర్ధరాత్రి 6 వేల అక్రమ ఇళ్ల పట్టాలకు తయారీకి వేదికగా నిలిచింది.

తహసీల్దారు కార్యాలయంలో గురువారం రాత్రి వేల సంఖ్యలో ఇళ్ల పట్టాలకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న కొల్లు రవీంద్ర టీడీపీ, జనసేన నాయకులు అక్కడకు చేరుకున్నారు. వీరి రాకను గమనించిన ఓ వీఆర్ఓ పెద్ద సంఖ్యలో పట్టాలతో కూడిన కట్టను పట్టుకుని పరారయ్యారు. వీఆర్​ఓ (VRO)ను నాయకులు వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేసేలోపే అతని వద్ద ఉన్న పత్రాలను మరో వ్యక్తి ద్వారా కనుమరుగయ్యేలా చేశారు. ఈ సమయంలో ఆఫీస్​లో ఎందుకున్నారని అడిగితే 'మూడా'కు సంబంధించిన పనులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారని విమర్శించారు. ఎమ్మార్వో తీరును నిరసిస్తూ కార్యాలయం ఎదుట కొల్లు రవీంద్ర తమ కార్యకర్తలతో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details