తెలంగాణ

telangana

సో బ్యూటిఫుల్‌ - కనువిందు చేస్తున్న ఖైరతాబాద్ గణేశ్ డ్రోన్ విజువల్స్ - Khairatabad Ganesh Drone Visuals

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 7:54 PM IST

Khairatabad Ganesh Drone Visuals (ETV Bharat)

Khairatabad Ganesh Drone Visuals : ఖైరతాబాద్‌ గణేశుడి డ్రోన్‌ విజువల్స్ అకట్టుకుంటున్నాయి. సప్తముఖ మహాశక్తి అవతారంలో ఉన్న గణేశ్‌రూపాన్ని కనువిందు చేస్తున్నాయి. ఈసారీ ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. 7 తలలు, 7 సర్పాలు, 12 హస్తాలతో రూపొందించారు. అందరికీ ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ భారీ విగ్రహాన్ని పర్యావరణ హితంగా తయారు చేశారు. ఏటా ఎత్తు పెంచుతూ వచ్చి తర్వాత ఒక్కో అడుగు తగ్గిస్తూ 40 అడుగులకు తేవాలని భావించినా అది అమలు కాలేదు. ఈసారి గణేశుడి నిర్మాణానికి 30 టన్నుల స్టీలు, 10 ట్రాలీల ఇసుక, 80 కిలోల జనపనార దారం, 2 వేల గోనె సంచులతో పాటు గుజరాత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వెయ్యి సంచుల మట్టితో 250 మంది కళాకారులు శ్రమించి రూ.80 లక్షల ఖర్చుతో దీన్ని తయారు చేశారు. ఎటువంటి పీవోపీ లేకుండా మట్టి, సహజమైన రంగులతోనే బడా గణేశ్ విగ్రహాన్ని తయారు చేశారు.

ABOUT THE AUTHOR

...view details