తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE: తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ - KCR To Telangana Bhavan Live

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 12:36 PM IST

Updated : Feb 6, 2024, 12:58 PM IST

KCR Live : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కొంత విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన అధినేతకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయంలో బీఆర్ఎస్‌ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నల్గొండ వేదికగా కృష్ణా జలాల పరిరక్షణ  బహిరంగ సభ నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్న గులాబీ పార్టీ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంత జిల్లాల నేతలతో గులాబీ దళపతి సమావేశమయ్యారు. ఈ  సమావేశానికి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలు హాజరయ్యారు. తదుపరి కార్యాచరణపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పోరాటం, ప్రభుత్వంపై ఒత్తిడి సహా తదితరాలపై వివరిస్తున్నారు. ఇదే సమయంలో గురువారం నుంచి జరగనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై  నేతలకు గులాబీ బాస్‌ సూచనలు చేస్తున్నారు. 

Last Updated : Feb 6, 2024, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details