ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేష్​- ఖరారు చేసిన జనసేనాని పవన్​ కల్యాణ్ - కందుల దుర్గేష్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 1:39 PM IST

Kandula Durgesh Name Finalised As Jansena Nidadavolu Candidate: జనసేన తరఫున పోటీ చేసే మరో అభ్యర్థి పేరును జనసేనాని పవన్‌ కల్యాణ్‌ (Pavan Kalyan) ఈరోజు ప్రకటించారు. నిడదవోలు నుంచి జనసేన (jansena) తరపున పోటీ చేయటానికి కందుల దుర్గేష్​ పేరును ఖరారు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా కందుల దుర్గేష్‌ పార్టీలో కీలకంగా ఉన్నారు. 

తెలుగుదేశంతో పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా రాజమండ్రి రూరల్‌ సీటును కందుల దుర్గేష్‌ ఆశించారు. అయితే తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆ స్థానంలో ఉండటంతో దుర్గేష్‌కు న్యాయం చేస్తామని కొద్దిరోజుల క్రితం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ క్రమంలో కందుల దుర్గేష్‌కు నిడదవోలు సీటు కేటాయిస్తూ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఇందులో ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా కందుల దుర్గేష్‌ పేరు ప్రకటనతో మిగిలిన స్థానాలు అభ్యర్థులపై త్వరలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details