ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విజయవాడలో 'బుజ్జి' సందడి- సెల్ఫీలకు ఎగబడుతున్న అభిమానులు - BUJJI PRESENTATION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 12:55 PM IST

Kalki Movie Bujji Was Buzzing in Vijayawada: 'బుజ్జి' పేరు వినగానే ఇంట్లో పిల్లలో లేక స్నేహితులో గుర్తుకు వచ్చేవారు. కానీ ఇప్పడు బుజ్జి అనగానే రెబల్ స్టార్ ప్రభాస్​ నటించిన కల్కి సినిమాలోని వాహనం కళ్ల ముందు కదలాడుతోంది. ఈ చిత్రంలో భైరవ ఎంత ఫేమసో ఆయనతో కలిసి సందడి చేసిన బుజ్జి కూడా అంత పాపులరైంది. విభిన్నమైన ఆకృతిలో ఉన్న బుజ్జి వాహనం విజయవాడలో సందడి చేసింది. ట్రెండ్ సెట్ మాల్‌లో ఉంచిన బుజ్జిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేరింతలు కొడుతున్నారు. బుజ్జితో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడుతున్నారు

ఈ వాహనాన్ని మహేంద్ర జయం కంపెనీ వాళ్లు తయారు చేశారు. బుజ్జి వాహనం గంటకి నలభై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ వాహనం మొత్తం బ్యాటరీపైనే నడుస్తుంది. 3 టైర్లతో సుమారు ఆరున్నర టన్నుల బరువు ఉంటుంది. ఈ వాహనానికి ఉపయోగించిన చక్రాలను సియట్​ కంపెనీ వాళ్లు రూపొందించారు. ఈ వాహనం బరువు అధికంగా వెనక చక్రంపైనే ఉంటుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌ పెడితే 50 కిలోమీటర్ల వరకు నడుస్తుందని మేకర్స్ తెలిపారు. అసలు బుజ్జి విశిష్టతలేంటి ఇది ఎలా నడుస్తుందనే వివరాలు మా ప్రతినిధి కనకరావు అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details