ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 2:54 PM IST

ETV Bharat / videos

చేతిలో సిగరెట్ -​ యూనిఫామ్​లోనే మద్యం తాగిన ఎస్​ఐ - వీడియో వైరల్​ - Kakinada SI Drinking Video Viral

Kakinada Police Station SI Ravindra Viral video : పోలీసు యూనిఫామ్​లో ఉండి ఓ ఎస్​ఐ మద్యం తాగిన ఘటన సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. మద్యం పార్టీలో ఓ ఎస్‌ఐ పాల్గొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో గురువారం హల్‌చల్‌ చేసింది. టేబుళ్లపై రెండు మందు గ్లాసులు కనిపిస్తుండగా యూనిఫాంలో ఎస్‌ఐ తాపీగా సిగరెట్‌ తాగుతున్నారు. ఈ వీడియోలో ఉన్న ఎస్‌ఐ ఎంవీవీ రవీంద్రబాబు గతంలో విజయవాడ భవానీపురం స్టేషన్‌లో పని చేశారు. ఏడు నెలల క్రితం బదిలీపై కాకినాడ గ్రామీణ నియోజకవర్గం తిమ్మాపురం పోలీసుస్టేషన్‌కు వచ్చారు.

ఈ పార్టీ ఎక్కడనేది స్పష్టత లేదు. ఇది విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ గది పక్కన జరిగిందనీ, తాను మద్యం తీసుకోలేదని ఎస్‌ఐ చెబుతున్నారు. భవానీపురం పీఎస్‌లో పని చేసే సమయంలో ఎస్‌ఐ పలు సెటిల్‌మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఏసీపీగా పని చేసే ఒక అధికారిని అడ్డం పెట్టుకుని పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details