తెలంగాణ

telangana

ETV Bharat / videos

అభివృద్ధిపై బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ అబద్దపు మాటలు చెబుతున్నాయి: కేఏ పాల్‌ - KA Paul on BRS and Congress - KA PAUL ON BRS AND CONGRESS

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 4:59 PM IST

KA Paul about MP Elections : నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్​ఎస్​, కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధపు మాటలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇప్పటికే రైతులకు సాగు నీళ్లు అందక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. నల్గొండలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  

KA Paul comments on KCR : లోక్​సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ తెలిపారు. గత ఎన్నికల్లో శాంతిసభకు అనుమతి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ చిత్తు, చిత్తుగా ఓడిపోయారన్నారు. ప్రజా శాంతి పార్టీ తరఫున వరంగల్ నుంచి బాబు మోహన్ పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కవిత జైలుకు వెళుతుందని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details