ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'రామోజీ మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటు' - దుబాయ్​లో నివాళులర్పించిన జనసేన, టీడీపీ నేతలు - JSP And TDP Leaders Tribute to Ramoji - JSP AND TDP LEADERS TRIBUTE TO RAMOJI

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 12:25 PM IST

JSP And TDP Leaders Tribute to Ramoji Rao in Dubai: రామోజీ గ్రూప్స్‌ అధినేత రామోజీరావు మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని దుబాయ్‌లోని తెలుగువారు విచారం వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు రామోజీరావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో కూటమి ఘనవిజయం సాధించడంలో రామోజీరావు బాధ్యతాయుతంగా వ్యవహరించారని తెలిపారు. గామా అవార్డ్స్‌కు గుర్తింపు దక్కడంలోనూ రామోజీరావు ప్రోత్సాహం మరువలేనిదని గుర్తుచేసుకున్నారు. తమకు రామోజీరావుతో చాలా దగ్గర సంబంధం ఉందని అక్కడి తెలుగువారు అన్నారు. 

గామా అవార్డ్స్​ను నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని దీనిని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడానికి ఈటీవీ నుంచి ఎంతో ప్రోద్భలం లభిస్తోందని వారు పేర్కొన్నారు. గామా అవార్డ్స్​కు రామోజీరావు ఎంతో అండగా నిలిచేవారని నేతలు తెలిపారు. అటువంటి గొప్ప వ్యక్తి మనందరితో లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని వారు పేర్కొన్నారు. రామోజీరావు ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇరుపార్టీ నేతలు ప్రార్థించారు. 

ABOUT THE AUTHOR

...view details