తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన జెండా సభకు సర్వం సిద్ధం- 5లక్షల మంది రావొచ్చని అంచనా - తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 1:42 PM IST
|Updated : Feb 28, 2024, 2:22 PM IST
'Jenda' Public Meeting Arrangements in Tadepalligudem : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం - జనసేన ఉమ్మడి సభకు సర్వం సిద్ధమైంది. 'జెండా' (Jenda) సభకు 5 లక్షల మందికి పైగా శ్రేణులు తరలి వస్తారన్న అంచనాతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు. సభ కోసం ఇప్పటికే పలు జిల్లాల నుంచి ఇరుపార్టీల శ్రేణులు తరలివెళ్తున్నారు. ఈ సభా వేదికగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై ఇరు పార్టీల అధినేతలు సందేశమివ్వనున్నారు.
TDP, Janasena Public Meeting in West godavari : వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే 'జెండా' సభ ప్రధాన ఉద్దేశంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు, సమీపంలోని కృష్ణా జిల్లాకు ఎంతో అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఈ భారీ బహిరంగసభ ఏర్పాట్లు (Arrangements) ముమ్మరమయ్యాయి. తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్డులో తణుకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిని అనుకుని దాదాపు 26 ఎకరాల విశాల మైదానంలో సభకు సర్వం సిద్ధం చేశారు. వేదిక పైన దాదాపు 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. లక్షల మంది హాజరయినా ప్రశాంతంగా సభను తిలకించేలా అతి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ జరుగుతోంది. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలిరానున్నాట్లు అంచనలు వేస్తున్నారు. వందల మంది పోలీసులు భద్రతా చర్యలతో సిద్దమయ్యారు. సభా (Meeting) ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు ఈటీవీ ప్రతినిధి అందిస్తారు.