ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రత్యేక హోదా సాధనకు ఇదే చక్కని అవకాశం - బడ్జెట్​ను అడ్డుకోవాలి : జేడీ - విభజన హామీల సాధన సమితి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 7:44 PM IST

JD Laxmi Narayana on Special Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, ముగించబడిన అధ్యాయమని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ప్రధాన కార్యదర్శి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. శ్రీకాకుళంలోని ఓ హోటల్లో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల్లో వైఎస్సార్​సీపీ, టీడీపీ ఎంపీలు మరోసారి కేంద్రాన్ని, ప్రత్యేక హోదాపై ప్రశ్నించాలని సాధన సమితి నేతలు జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్ అన్నారు. 

ప్రత్యేక హోదా విభజన హామీల కోసం రాష్ట్రంలోని ఎంపీలు ఓట్​ ఆన్​ అకౌంట్​ బడ్జెట్​ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్​ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవే చివరి పార్లమెంట్​ సమావేశాలు కాబట్టి, ప్రత్యేక హోదా సాధనకు ఇదో అవకాశమని సూచించారు. ప్రత్యేక హోదా సాధించేందుకు వచ్చిన అనేక అవకాశాలను, వైఎస్సార్​సీపీ, టీడీపీ ఏనాడూ వాడుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక హోదా రావాలనే ఆకాంక్ష ఉందని సాధన సమితి నేతలు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details