అనుచరులకు జేసీ ప్రభాకర్‌రెడ్డి స్వీట్ వార్నింగ్ - పద్ధతి మార్చుకోవాలని హితవు - JC Prabhakar Reddy on Illegal Sand
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2024, 12:20 PM IST
JC Prabhakar Reddy on Illegal Sand : తాడిపత్రి నియోజకవర్గంలో కార్యకర్తలు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి తనకు దూరం కావద్దని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తన అనుచరులను ఉద్దేశించి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాను ఇసుక మాఫియాతో పోరాడి హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించానని తెలిపారు. ఆ పోరాటానికి మీరు కూడా సహకరించారని గుర్తు చేశారు.
Illegal Sand Mining in Tadipatri : కానీ తన అనుచరులు ఇప్పుడు ఇసుక మాఫియా దందా చేయడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి తప్పుబట్టారు. ''ఇసుక అక్రమ తవ్వకాలపై పోరాడిన మనమే అక్రమంగా ఇలా చేయడం సరికాదు. మీకు ఆర్థిక ఇబ్బందులుంటే వేరే ఏర్పాటు చేస్తా. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి. నియోజకవర్గంలో 25 మంది ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. వారు వెంటనే ఆ పనులు ఆపేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి పోవాలి.'' అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి వీడియో విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.