జగన్ పాలనలో పరిశ్రమలు మూతపడి కార్మికులు వీధినపడ్డారు: జేసీ ప్రభాకర్ రెడ్డి - యాడికిలో యువ చైతన్య బస్సు యాత్ర
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 4:52 PM IST
JC Prabhakar Reddy Conducted the Yuva Chaitanya Bus Yatra: జగన్ పాలనలో డోలమైట్ పరిశ్రమ మూతపడి కార్మికులు వీధిన పడ్డారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా యాడికిలో యువ చైతన్య బస్సు యాత్ర ముగింపు ర్యాలీ నిర్వహించారు. డోలమైట్ పరిశ్రమ మూతపడి ఉపాధి కోల్పోయిన కార్మికులే తమకు మద్ధతుగా తరలించారని పేర్కొన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మూతపడిన పరిశ్రమలన్నీ తెరిపించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Anantapur District: పాడిపోషణ చేస్తున్న కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తరవాత ప్రతి ఇంటికీ రెండు పశువులను ఇప్పిస్తామని జేసీ ప్రభాకర్ పేర్కొన్నారు. పాడిపరిశ్రమతో కుటుంబ పోషణ జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. యాడికి కాలువకు నీరు ఇస్తే భూగర్భ జలాలు పెరిగి రైతులు బాగుపడతారని తెలియజేశారు. స్థానిక సమస్యల పరిష్కర లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తామని సృష్టం చేశారు.