మితిమీరిన వైస్సార్సీపీ నేతల ఆగడాలు- పట్టించుకోని పోలీసులు - వైఎస్సార్సీపీ నాయకుల ఆగడాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 12:31 PM IST
Janasena Leaders Protest For Flexy in Krishna District : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ నాయకుల ఆగడాలు మితి మీరుతున్నాయి. అర్ధరాత్రి జనసేన ఫ్లెక్సీలను పేర్ని నాని అనుచరులు తొలగించారు. మొన్న జనసేన దిమ్మను తొలగించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి జనసేన నాయకుడు కొరియర్ శ్రీను కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అనుచరులు జనసేన ఫ్లెక్సీలు తొలగించారు. తొలగించిన ఫ్లెక్సీలను అక్కడే దగ్ధం చేశారు.
ఇదంతా పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు పనే అంటూ జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల ఆగడాలు సీసీ కెమెరాల్లో రికార్డైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఆధారాలున్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల్లో ఫేక్లీలు ద్వంసం చేసిన దృశ్యాలు రికార్డు అయినా నిందితులను పోలీసులు అరెస్టు చేయలేయకపోగా ఏమీ పట్టనట్టు ఉంటున్నారని జనసేన అనుచరులు వాపోతున్నారు.