ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ హయాంలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టింది : కొణతాల రామకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 5:36 PM IST

Janasena Leader Konathala Ramakrishna Comments: వైఎస్సార్సీపీ హయాంలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. అనకాపల్లిలో జనసేన పార్టీ క్యాంపు కార్యాలయాన్ని కొణతాల ప్రారంభించారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ విద్యా వ్యవస్థలో రోజుకో విధానాన్ని ప్రవేశపెడుతూ అయోమయానికి గురి చేస్తున్నారన్నారు . ఒకసారి ఆంగ్ల మాధ్యమం అని, మరోసారి సీబీఎస్ఈ అంటూ ఇప్పుడు కొత్తగా ఐబీ అంటున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లgగా నిరుద్యోగులను మోసం చేస్తూ ఎన్నికల ముందు కంటితుడుపు చర్యగా జగన్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూల్స్​లో సుమారు 25 వేల డీఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కానీ, ఎన్నికలకు ముందు 6100 పోస్టులు భర్తీ అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి హడావిడిగా నోటిఫికేషన్ విడుదల చేశారని ఆరోపించారు. నిరుద్యోగులను మోసం చేయడానికే నోటిఫికేషన్ విడుదల చేశారని ఆరోపించారు.

వైఎస్సార్సీపీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంపై కొణతాల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వం తీసుకువస్తున్న ''సమగ్ర భూ రక్షణ చట్టం'' వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తేవాలనుకున్న ''సమగ్ర భూ రక్షణ చట్టాన్ని'' గుజరాత్​లో కూడా  అమలు చేయడం లేదని తెలిపారు. కానీ, ఏపీలో ఆ చట్టం అమలు కోసం జగన్మోహన్ రెడ్డి తహతహలాడుతున్నారని కొణతాల ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details