ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నారు' - కోడికత్తి కేసు విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వానికి నాగబాబు విజ్ఞప్తి - janasena nagababu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 2:29 PM IST

janasena_nagababu (ETV Bharat)

Janasena Nagababu about Kodikatti Case : కోడికత్తి కేసుపై విచారణ వేగవంతం చేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సామాజిక మాధ్యమం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా పులివెందుల MLA జగన్‌కు ప్రభుత్వం న్యాయం చేకూర్చాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లో ఎమ్మెల్యేగా ఉన్న జగన్‌పై విమానాశ్రయంలో శ్రీను అనే వ్యక్తి కోడికత్తిలో దాడి చేశారని, ఐదేళ్లు దాటినా ఆ కేసు కొలిక్కి రాలేదని నాగబాబు పేర్కొన్నారు. ఆ ఘటన తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్‌ కేసు విచారణకు హాజరు కాలేదన్నారు. గత ఐదేళ్లలో ఆయన సీఎంగా తీరిక లేకుండా ఉండటం వల్ల విచారణకు హాజరుకాలేకపోయారని నాగబాబు ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని నాగబాబు కోరారు. కోడికత్తి ఘటనలో వాస్తవాలు తెలియాలని, హత్యాయత్నం చేసినవారికి సరైన శిక్ష పడాలని నాగబాబు అన్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి చర్యలు తీసుకోవాలని నాగబాబు కోరారు.

ABOUT THE AUTHOR

...view details